తెలుగు చలనచిత్రం చరిత్రలోనే తొలిసారిగా biopic అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు దర్శకుడు నాగ అశ్విన్ గారు. నాకు ‘మహానటి’ సావిత్రి గారి గురించి సమీక్షా(Review) ఇచ్చే అంత వయస్సు కానీ అనుభవం కాని లేవు ఎప్పటికి రాదు.సావిత్రి గారి సినీ ప్రస్థానం గురించి చెప్పడానికి అక్షరాలు సరిపోవు, అలాంటి సావిత్రి గారి జీవితాన్ని ఒక్క చక్కటి దృశ్యకావ్యంగా మనందరికీ చూపించారు దర్శకుడు. సావిత్రి గారి జీవితంలోని సంఘటనలు ఆధారంగా ఎంతోమంది పాఠాలు నేర్చుకోవచ్చు. సావిత్రి గారికి కృషి, పట్టుదల, అందం, అభినయం ఇవ్వని సమపాలలో కలిగి ఉన్న నటిమనురాలు. తన నటప్రస్థానం భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకం.
ఈ చిత్రం గురించి మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్న ఇంకా ఏదో ఒక్క విషయం మిగిలిపోతది.
దర్శకుడు ఈ చిత్రాన్ని చెయ్యడం అంటే ఒక్క గొప్ప సాహసం అనే చెప్పాలి. వెండితెర మీద ఒక్క జీవితాన్ని
అందులోని ఎత్తు పళ్ళాలని దానిలో నుంచి జీవిత సత్యాలని మనం గ్రహించవచ్చు. ప్రతి ఒక్కరి
జీవితంలోకి తొంగి చూస్తే ఎత్తుపల్లాలు ఉంటాయి, దాని గ్రహించి సహాయం చెయ్యాలి కానీ వాళ్ళ దగ్గర సహాయం తీసుకొని, సహాయం చేసిన వాళ్ళు బాధలో ఉన్నప్పుడూ సహాయం చేయ్యకపోవడం వల్లె సావిత్రి గారి
జీవితం అలా ముగిసింది.
రాజేంద్రప్రసాద్,సమంతా,విజయ్ దేవరకొండ అందరూ చాలా బాగా చేశారు. కీర్తి సురేశ్ నటన గురించి ఎంత చెప్పిన
తక్కువ అవుతది.
Final Verdict: వెండితెర మహానటి జీవితాన్ని వెండితెర మీద
కచ్చితంగా చూడాల్సిన చిత్రం... కాదు... కాదు... జీవితం