ఒక్క అచ్చమైన పల్లెటూరు నేపథ్యంలో
సాగే చిత్రం, పచ్చని
పంటపొల్లాలు,1980లో కాలం నాటి పొల్లం గట్ల దగ్గర అబ్బాయి,అమ్మాయి ప్రేమకథ, పల్లెటూరు రాజకీయాలు ఇవన్ని కలిపిన
తెలుగు చిత్రం రంగస్థలం. అందుకే నేను ఈసారి నా సమీక్షని పూర్తిగా తెలుగులోనే
రాయాలి అని అనుకున్నాను.
రంగస్థలం చిత్రం పేరులోనే అంతర్లీనంగా ఒక్క
సందేశం ఉంది. రంగస్థలం అనగా నాటకం వేసే స్థలం, ఈ ప్రపంచం యే ఒక్క రంగస్థలం అందులో మనం పాత్రధారులం. మొదటి
నుంచి ఈ చిత్రం గురించి ప్రచారం చేసినప్పుడు ఈ చిత్రం 1980 కాలం నాటి చిత్రం అని
దర్శకుడు అన్నారు. ఆ కాలం యువతకి ఇప్పుడు ఈ చిత్రం చూస్తే వాళ్ళ చిన్ననాటి
జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు, ఈ కాలం యువత ఆ కాలం గురించి
చూస్తే మేము ఈ కాలంలో technology,smartphone అనే చక్రంలో
ఇర్రుకుపోయి బయటి ప్రపంచం మరియు బంధాల గురించి మరిచిపోతున్నాము అని గమనించగలరు.
సమంత తన పాత్రని మనకి పరిచయం చేసినపుడే అందరికీ ఒక్క అవగాహన వచ్చి ఉంటది
అచ్చమైన పదహారు అణాల తెలుగు అమ్మాయిగా నటించింది అని. అక్కినేని వారి కోడళ్ళు చాలా
చక్కగా,
పల్లెటూరు అమ్మాయి, గడుసుదనం ఉన్న పిల్ల లాగా బాగా
నటించింది.
రాంచరణ్ తను ఎప్పుడు చేసే చిత్రాలా కాకుండా పూర్తి బిన్నంగా తన పాత్ర ఉంది.
ఇందులో చెవిటి వాడిలా అలాగే పల్లెటూరు రోషం కలిగిన అబ్బాయిలాగా బాగా నటించాడు. తన
వేషబాషా పూర్తిగా కోనసీమ బుల్లోడులాగా అందరినీ అలరించాడు. రాంచరణ్ చిట్టిబాబు పాత్రలో
పరకాయ ప్రవేశం చేశాడు.
ఈ చిత్రంలో ప్రతి పాటకి ఒక్క ప్రత్యేకత ఉంది. ప్రతి పాటలోని సాహిత్యం ప్రతి
ఒక్కరికీ వారి హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఎంత సకగున్నావే పాట ఒక్కటి చాలు మన
అచ్చతెలుగు ఆడపిల్లని ఎలా అభివర్ణించచో చంద్రబోస్ గారు చక్కగా చెప్పారు.
అనసూయ చెప్పుకోదగ్గ పాత్ర చేసింది. ఆది పినిశెట్టి తన పాత్ర పరిధి మేరకు నటించాడు.
దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ప్రతి పాటకి
జతకట్టిన ఆట చాలా బాగుంది. రెండవ అర్థ బాగంలో కొన్ని సన్నివేశాల దగ్గర మన కళ్ళు చెమ్మగిలుతాయి.
దర్శకుడు సుకుమార్ ఏ చిత్రం అయిన సుకుమారంగా తెరకెక్కిస్తారు. ఎప్పటిలాగే ఈ చిత్రాన్ని
కూడా తన మనస్సు పెట్టి తీశారు.
చివరిగా నేను చెప్పేది ఒక్కటే రంగస్థలం చిత్రం వెండితెర రంగస్థలాన్ని పరిపాలించడానికి వచ్చేసింది.